అరుంధతి సినిమా అప్పుడు తీసివుంటే?

చల్లా కాలం నుంచీ బ్రహ్మబుధ్ నా దగ్గరకు రావటం మానేశాడు. వాడు ఈమధ్య మన తెలుగు సినిమాలు వదలి తెలుగు బ్లాగులు తెగ చదువుతూ నన్ను మరచిపోయాడు. వాడు నా వైపు రానందుకు సంతోషించినా వాడు నా బ్లాగు చదవటం మానేసి ( నా బ్లాగు దిక్కు కూడా చూడలేదన్నది వేరే విషయం) ధూం, ఏకలింగం, మూర్ఖుడు అనే బ్లాగులను విడవక పదే పదే చదువుతూ, పడీ పడీ నవ్వుతూ, లేచి మళ్ళీ చదివి, నవ్వి పడి, మళ్ళీ లేచి మళ్ళీ చదివి, చదివినవే చదివి, నవ్వినట్టే నవ్వుతూ, పడీ పడీ పొర్లుతూ, పడి లేస్తూ, చదివి పడుతూ…….. ఇక వాడిని వదిలేశా.

అలా నాదగ్గరకు రావటం మానేసిన బ్రహ్మబుధ్ హఠాత్తుగా ఒక రోజు, భళ్ళున మెదడు తలుపు తన్ని లోపలకు చెళ్ళున దూకేసరికి ఉలిక్కిపడ్డాను.

నన్నొదిలి ఏకలింగం బ్లాగులో శతకోటిలింగాల్లో ఒకడివయిపోయావనుకున్నాను, అన్నాను నిష్టూరంగా. ఎంతయినా. నాద్వారా మన లోకంలో అడుగుపెట్టిన బ్రహ్మబుధ్, నా బ్లాగు వదలి వేరేవారి బ్లాగులు చదువుతూంటే  నాకు మండదా?

నా మాటలకు వాడు, భళ్ళు భళాళు న భయంకరంగా నవ్వాడు.

ముఋఋఆళ్ళీ నిన్ను వదలను ముర్రాళ్ళీ అన్నాడు, ఖళ్ళు ఖళ్ళు మంటూ.

నా గుండె గుడుక్కుమంది. నేనేది జరగకూడదని వెయ్యిన్నొక్క దేవుళ్ళకు దణ్ణాలు పెట్తుకుంటూన్నానో అదే జరిగింది. వీడు అరుంధతి సినిమా చూసేసాడు.

బాబూ అరుంధతి కథ నాకు చెప్పకు. నేను భరించలేను, అన్నాను.

ఖర్రు ఖర్రు మని నవ్వాడు. ఖుర్రు ఖుర్రు మని ఇకిలించాడు.

నేను నీకు మాజిక్ చూపిస్తా అన్నాడు.

ఏమి మాజిక్ రా బాబూ? అడిగాను భయంగా.

అరుంధతి మాజిక్ ముర్రాళ్ళీ అన్నాడు.

ఒరే నన్ను మురళీ అను. లేకపోతే వదిలేయ్ కానీ, ఆ ముర్రాళ్ళీ ఏమిటిరా? అన్నాను.

నిన్నొదల ముర్రాళ్ళీ, గిర్రాళ్ళీ, విర్రాళ్ళీ, చుర్రాళ్ళీ, అంటూ ఏవేవో విచిత్రమయిన శబ్దాలు చేయటం మొదలుపెట్టాడు.

భరించలేక చెవులు మూసుకున్నా, బాబూ, నువ్వుమాటలాపి చూపించాలనుకున్న అరుంధతి మాజిక్ చూపించేయ్యి, అన్నాను.

వాడు నవ్వాడు. హర్ర, కుర్ర, బిర్ర, చుర్ర, లుర్ర కుర్ర ముర్రాళ్ళీ అన్నాడు.

చిత్రం… నా ఎదురుగా అదేదో తెరపైన ఏవేవో దృశ్యాలు కనబడటం ఆరంభమయింది. ముందు అస్పష్టంగా వున్న దృశ్యాలు నెమ్మదిగా స్పష్టంగా కనబడసాగాయి.

అప్పుడు నాకర్ధమయింది. వీడేదో బుధలోకం మాజిక్ నాపైన ప్రయోగిస్తున్నాడని.

ఆ మాజిక్ ఏమిటో రేపు.

Enter Your Mail Address

June 5, 2009 ·  · 5 Comments
Posted in: sinemaa vishleashaNaa.

5 Responses

 1. నాగప్రసాద్ - June 5, 2009

  సరే అయితే! నా కామెంటు కూడా రేపే!…:)

 2. Malakpet Rowdy - June 5, 2009

  “నన్నొదిలి ఏకలింగం బ్లాగులో శతకోటిలింగాల్లో ఒకడివయిపోయావనుకున్నాను,”

  LOLLLLLL

 3. Sarath 'Kaalam' - June 5, 2009

  శతకోటి లింగాల్లో బోడి లింగం అయిపోయాడా ఏంటి మీ బ్రహ్మబుధ్!

 4. atchutbellapu - January 9, 2015

  సూపర్ తెలుగు

 5. atchutbellapu - January 9, 2015

  బాబు ఆ అరుందతి కధ నాకు చెప్పితె నేను భరించితిని

Leave a Reply