అరుంధతి సినిమా అప్పుడే తీసివుంటే! బ్రహ్మబుధ్ ఊహ!

బ్రహ్మబుధ్ మాజిక్ చూసి నోరు తెరిచా.

నా కళ్ళ ఎదురుగా ఒక సినిమా రీలులా పాత సినిమాలన్నీ కదలసాగాయి.

నాకు భయం వేసింది. నేను చూస్తున్నది కలనా భ్రమా అర్ధం కాలేదు.

మీ బ్రతుకే భ్రమలో కల. కలలో భ్రమ. కానీ భ్రమలో భ్రమని చూసి భ్రమపది భయపడతారు, అంటూ వికృతంగా నవ్వాడు బ్రహ్మబుధ్ నన్ను, నా భయాన్ని చూసి.

భయపడ్డవాడికి తనభయాన్ని చూసి ఎవరయినా నవ్వితే కోపం వస్తుంది. నాకూ కోపం వచ్చింది. ఏమిటిదంతా? అనడిగా.

నేను మీ సినిమాలన్నీ చూసేసా. ఙ్నానమంతా సంపాదించేసా, అన్నాడు.

ఒరే బ్రహ్మబుధు, అంతా తెలుసనుకునేవాడికి ఏమీ తెలియదు. నాలుగు సినిమాలు చూసి అంతా తెలుసనుకుంటే…..

నన్నుమాట పూర్తిచేయనివ్వలేదు. నాలుగు పుస్తకాలు చదివినవాడు తనకంతా తెలుసంటాడు. నాలుగు పుస్తకాల్లోంచి ఉదాహరిస్తే వాడు మాస్టర్. పరిశోధకపితామహుడు. నాలుగు సినిమాలు చూస్తే నేనెందుకు సినిమా మాస్టర్ ని కాను?

బ్రహ్మబుధ్ తో వాదించకూడదని మరచిపోయాను. సరే ఇప్పుడేమిటి? ఆ బ్లాగులేవో చదువుతూ నవ్వుకుంటూ పడుతూ లేస్తూండక నా దగ్గరకెందుకొచ్చావు? అడిగా.

నాకో భయంకరమయిన ఆలోచన వచ్చింది. దాన్ని నీకు చెప్పాలనిపించింది.

ఏమిటా భయంకరమయిన ఆలోచన?

నా మాజిక్ తో అరుంధతి సినిమాను అప్పుడే, అంటే మీ సినిమాలు సినిమాలుగా వున్నప్పుడే తీసివుంటే ఎలావుండేదో నీకు కళ్ళకు కట్టినట్టు చూపించాలని వచ్చాను.

ఆకాలంలో ఈ సినిమా తీసివుండేవారు కారు. ఇంత సాంకేతిక పరిఙ్నానం, ఇంత అభివృద్ధి మేము సాధించలేదు.

కళ్ళురిమాడు బ్రహ్మబుధ్. నేను నోరుమూసాను.

నేను మాట్లాడుతూంటే మాట్లాడకు. నాకంతా తెలుసు. నేను చెప్పిందివిను. మధ్యలో మాట్లాడితే, అని క్క్క్రుకల్స్కఫ్హ్ల్క్ద్, బ్చ్ఫిజ్, హ్జ్ఫ్గిఉఎవందస్, అని విచిత్రమయిన శబ్దాలు చేశాడు.

కాళ్ళమీదపడి, కళ్ళద్దుకుని, కళ్ళొత్తుకున్నాను.

ఇదిగో, ఇప్పుడు నీ కళ్ళముందు, ఆనాటి నిర్మాత, దర్శకుడు, నటీ నటులు, రచయితలు కూచుని అరుంధతి సినిమా తయారీ గురించి చర్చించుకోవటం కనిపిస్తుంది, అన్నాడు.

నిజమే…. నా కళ్ళముందు కొందరొక గదిలో కూచుని కనిపించారు. నాకు వాళ్ళ మాటలు వినిపిస్తున్నాయి. చేతలు కనిపిస్తున్నాయి.

మన సినిమాలు రొటీనయిపోతున్నాయి. ప్రేమలు, పగలు, ప్రతీకారాలు తప్పించి కొత్త సబ్జెక్టులు లేవు. ఏదయినా కొత్త సబ్జెక్టుతో సినిమాతీసి ప్రజలను షాక్ చేద్దాం, అన్నాడికడు, గుప్పు గుప్పున పొగ వదుల్తూ.

నా కళ్ళ ముందు పొగత్రాగడం నేరం, అన్న అక్షరాలు కనిపించాయి.

మిగతా తరువాత.

Enter Your Mail Address

June 6, 2009 ·  · 3 Comments
Posted in: sinemaa vishleashaNaa.

3 Responses

 1. Sree - June 6, 2009

  ఇదేంటి ‘సారు’.. అంతలోనే ముగించే’సారు’..

 2. అభిమాని - June 6, 2009

  చల్లా కాలం, ఙ్నానమంతా, పరిఙ్నానం
  ఈ తెలుగు కూడా బుధలోకం నుండి దిగుమతి చేసుకున్నారా ఏమిటి కొంపతీసి?

 3. కస్తూరి మురళీకృష్ణ - June 6, 2009

  sree గారూ,
  మంచి మూడులో బ్రహ్మబుధ్ మాయ చూపుతూంటే కరెంటు పోయింది. మాయ మాయమై పోయింది. మళ్ళీ బ్రహ్మబుధ్ వచ్చేవరకూ అందుకే వాయిదావేశాను.

  అభిమానిగారూ,

  మీ అభిమానానికి జోహార్లు. బ్రహ్మబుధ్ నన్ను వదలనట్టే అచ్చుతప్పులూ తప్పటంలేదు. క్షమించండి.

Leave a Reply