పెద్దపులులకు మానవహక్కులా?

sagatu manishiఈ ఆదివారం ఆంధ్రప్రభలో సగటుమనిషిస్వగతం శీర్షికన ప్రచురితమయిన నా వ్యాసం ఇది. దీనిపై మీ స్పందనను నిర్మొహమాటంగా తెలియచేయ ప్రార్ధన.

Enter Your Mail Address

June 10, 2009 ·  · 7 Comments
Tags: , , , , , ,  · Posted in: నా రచనలు.

7 Responses

 1. కె.మహేష్ కుమార్ - June 10, 2009

  “మంచి” “చెడు” అనేవి గిరిగీసుకుని వేరువేరుగా ఉండే కాలం కాదిది. సద్ధాం హుస్సేన్ కుర్దులను చంపినా అమెరికా దౌష్ట్యాలకు ఎదురొడ్డి తన ప్రజల కోసం పోరాడిన యోధుడిగా గుర్తించడంలో తప్పు లేదు. ప్రభాకరన్ పద్ధతులు ఉగ్రవాదమైనా, ఆశయం శ్రీలంక తమిళుల హక్కులు కాబట్టి అతడిని శ్రీలంక తమిళులు దేవుడ్ని చేసినా అది గర్హనీయం కాదు.

  When human being is capable of being good and bad at same time in equal measures, why do you want to judge them only through one pint of view? పరిస్థితుల సంక్లిష్టతను విస్మరించి ఈ “నాయకులను” రాక్షసులుగా చిత్రీకరించబూనడం మీ సమకాలిన జ్ఞానం యొక్క రాహిత్యానికైనా చిహ్నమవ్వాలి లేక కొన్ని నిర్ధిష్టమైన విలువల్ని absolute అనుకునే మానసికతకైనా చిహ్నమవ్వాలి. ఏదిఏమైనా మీ వివరణ ఏకపక్షం.

  కసాబ్ విషయంలో కూడా ఈ వ్యాసంలో మీరు అదే ధోరణిని అవలంభించారు. చట్టం ప్రకారం కేసు నడుస్తున్నప్పుడు ముద్ధాయి రాక్షసుడైనా కూడా కొన్ని హక్కులుంటాయి. మానవహక్కుల సంఘాలు కోరుతున్నది ఆ హక్కులు ఇవ్వకపోతే రాజ్యాంగానికే అవమానం అని. We are a law abiding citizens, if we don’t follow the law what’s the difference between we and Kasab?

 2. రవి - June 10, 2009

  మహేష్ గారు,

  >>“మంచి” “చెడు” అనేవి గిరిగీసుకుని వేరువేరుగా ఉండే కాలం కాదిది.

  అలాంటప్పుడు, కోర్టులు, న్యాయము, చట్టమూ ఇవన్నీ పనికి రానివే అనుకోవాలి. ఒకరికి మంచిగా కనిపించినది, మరొకరికి చెడ్డగా కనిపిస్తుంది. ఒసామా బిన్ లాడెను, వీరప్పన్ వీళ్ళను ఆరాధించే వాళ్ళు ఉన్నారు. వీళ్ళనెందుకు నేరస్తులుగా ముద్ర వేయాలి? వీళ్ళు నేరస్తులు అయినప్పుడు, ప్రబాకరన్ ఏ రకంగా నేరస్థుడు కాడు?

  >>ప్రభాకరన్ పద్ధతులు ఉగ్రవాదమైనా, ఆశయం శ్రీలంక తమిళుల హక్కులు కాబట్టి …

  నిజంగా? ఆయన ఆశయం తమిళుల హక్కులు మాత్రమేనా? “సముద్ర జలాలపై హక్కులు కావాలనడం” ఏ రకంగా తమిళుల ఆశయ సాధనో నాకు అర్థం కావడం లేదు!

  “When human being is capable of being good and bad at same time in equal measures,…

  Equal measures???? On what account?

  తమిళుల ఆశయాన్ని తప్పు పట్టట్లేదు. ఎటొచ్చీ, ఆశయ సాధన వికృతరూపు సంతరించుకోవడమే గర్హనీయం. కారణం లేకుండానే 31 దేశాలు LTTE ని బహిష్కరించాయంటారా? ఇది వరకు చంద్రమోహన్ గారు వ్రాసిన టపాలో, ప్రభాకరన్ బాట తమిళులకు కూడా ఆదర్శం కాకూడదు అని చెప్పారు.

  కసబ్ గురించి కస్తూరి మురళీకృష్ణ చెప్పింది మరోసారి చూడండి. “అనవసరంగా నేరం మోపారని మానవహక్కుల వారు గోల చేసినా …” ఇందులో తన basic rights ను కాలదన్నడం అన్న ప్రసక్తి లేదు.

 3. కె.మహేష్ కుమార్ - June 10, 2009

  @రవి: కోర్టులు-చట్టం వేరు “న్యాయం-ధర్మం” వేరు. వ్యాసం ప్రారంభంలో ఏర్పరచిన ప్రాతిపదిక ఏమిటో ఒకసారి గమనించండి. శ్రీలంక ప్రభుత్వం ప్రకారం ప్రభాకరన్ చట్టపరంగా దోషి. అందులో ఏ మాత్రం సందేహం లేదు. కానీ శ్రీలంక తమిళులకు తమ తరఫున న్యాయపోరాటం జరుపుతున్న నాయకుడు. ఈ రెండూ పరస్పర విరుద్ధాలే అయినా ఆమోదయోగ్యాలే కావాలి అని మాత్రమే నేను చెప్పింది. My strongest disagreement is with calling him “రాక్షసుడు”. అదీ ప్రత్యేకంగా మైథాలాజికల్ ఇమేజెస్ ని ప్రేరేపించిమరీ ఏకపక్ష value judgment చెయ్యడానికి అభ్యంతరం చెప్పాను.

  శ్రీలంక ప్రభుత్వం ప్రభాకరన్ ను చంపడాన్ని నేను తప్పుబట్టలేదే! అది రాజ్యాంగపరంగా వారికున్న హక్కు, బాధ్యత. ప్రభాకరన్ మిగతా తమిళ గ్రూపుల నాయకత్వాన్ని ఎలా మట్టుబెట్టి ఏక ఛత్రాధిపత్యం వహించాడో తను చేసిన హత్యాంకాండలెన్నో లెక్కెంచడంతో పాటూ what he stands for Srilankan Tamils also needs to be respected. ప్రభాకరన్ బాట ఆదర్శం కాకపోవచ్చు, కానీ ఆశయాన్ని తప్పుబట్టలేముకదా! అందుకే ఈ చెడులోకూడా మంచి ఉంది అంటున్నాను.

 4. రవి - June 10, 2009

  మహేష్ గారు,

  “ప్రభాకరన్ బాట ఆదర్శం కాకపోవచ్చు, కానీ ఆశయాన్ని తప్పుబట్టలేముకదా” …

  ఆశయం నిస్వార్థపూరితం అని మీరెలా conclude అయారు? నిజంగా ఆశయం అలా నిస్వార్థ పూరితం అయితే, సమస్య పరిష్కారానికి పాటు పడి ఉండేవాడు. నానుస్తూ, వల్లమాలిన కోరికలు కోరుతూ ఉద్యమాన్ని పెడత్రోవ పట్టించడు. తన ఆశయం నిజంగా తమిళుల హక్కులు సాధించటమా, లేక ప్రత్యేక తమిళ రాజ్యాన్ని స్థాపించి, దానికి నాయకుడుగా మారి పబ్బం గడుపుకోవడమా?

  ఇప్పుడు మీరు ఆరోపించిన value judgment విషయం. వ్యాసకర్త వాక్యం… “ఒక ప్రాణం పోవటం, అదీ ఇలా అర్ధంతరంగా, హింసాత్మకంగా పోవటం బాధాకరం….” ప్రభాకరన్ కు రచయిత పై సానుభూతి ఉన్నదనేది స్పష్టం.

  “ప్రభాకరన్ ఒక విప్లవ వీరుడు, దేశభక్తుడు…” ఇది value judgment అవదా? వ్యాసకర్త దీన్నే కదా గర్హించినది? ఒక value judgment ను తప్పు అని చెబితే, అది మరొక value judgment ఎలా అవుతుంది?

  న్యాయం చాలా చిన్న equation. నీవు, నీక్కావలసిన నలుగురి కోసం వందమందిని బాధపెడితే అది అన్యాయం. రచయితకు ప్రభాకరన్ ప్రాణాలపై సానుభూతి ఉంది, అలానే ప్రభాకరన్ చేతిలో మరణించిన వారి మీదాను. అందువల్ల మురళీకృష్ణ ప్రభాకరన్ ను రాక్షసుడని చెబితే, అది ప్రభాకరన్ రాక్షసత్వాన్ని గర్హించటమే తప్ప, value judgment అవుతుందని నాకనిపించట్లేదు.

 5. రవి - June 10, 2009

  “ప్రభాకరన్ పై రచయితకు” అని ఉండాలి, పైన నా సమాధానంలో…:)

 6. GURRAM SEETARAMULU - June 10, 2009

  Murali gaaru mee raatalu mee abhipraayam gaa
  మురలి గారు మీ కెందుకండీ ఈ బాదంతా…..

  మీ కు తెలుసొ లెదొ రాజీవ్గంధి ని చ0పిన ఆమెను శ్రిల0క మిలటరీ్ పొలిసిలు
  20్ మంది Gang rape చెసారు

  అది India milatary కనుసన్నలలొ జరిగింది
  Srilanka జాతుల సంస్య ఉంటె అది ఆ దెసమ్ చుసుకొవాలి దానికి Madrass milatary base
  లొ సిక్షన యెందుకు ఇవ్వాలి?
  ఇజ్రాయిల్ లొ యెందుకు traning తీసుకొవాలి ఈ హత్య indian milatary కనుసన్నలలొ జరిగిందన టానికి ఆ దెస రక్షన్ మంత్రి మాటలు చాలు
  Srilanka lo దా దాపు 1,00,000 మంది చనిపొయారు మరొ లక్ష మంది నిలువ నీడ లెకుండా మిగిలారు 20 వ శతాబ్ద0్ లొ ఇది అత్యంత మారన హనన0
  Srilanka లొ వందల్ సంచరాలుగా ఉంతున్న వాల్లకు సరిన హక్కులు కొరడమ్ తప్పంటారా?

 7. kcube varma - June 11, 2009

  mana varaku nashtam lenappudu ennaina cheptam. bhaarth nundi enno yella kritam velli vetti chakiri chesi British vaarito paatu lanka vaalla sampadanu perigemduku baanisa jeevitam anubhavimchevariki kannesam valla chaduvu vaala bhashalo chaduvukune avakasam lekapoga anni lakshalamamdi maatade bhashaku kaneesapu gurtimpunaku kooda tiraskarimchina prabhutvala charyala patla visugu chemdi modalaina poratam eelam. daanni evo charyala valana tappu pattadam bhavyam kaadu. porata roopalu himsa margam pattadaanki aya prabhutvale kaaranam. hakkulu kolpoyina vaalla pakshame vundaali gaani licensed killers ayina prabhutva goondaalaku evari support akkaraledu. maanava hakkula gurinchi chaala lotuga charchinchali.

Leave a Reply