సాహిర్- ఒక సవరణ- ఒక విన్నపం!

సాహిర్ లూధియానవీ వ్యాసాన్ని ప్రచురించిన తరువాత చూసుకుంటే మొదటి రెండు పేజీలు చివరలో వచ్చాయి. వ్యాసం మూడవ పేజీతో ఆరంభమవుతోంది. కాబట్టి, నా కంప్యూటర్ సాకేంతిక పరిఙ్నాన అఙ్నానికి నా అపీ జాలి తలచి, నన్ను క్షమించి, వ్యాసాన్ని ముందు చివరికి వెళ్ళి రెండు పేజీలు చదివి, మళ్ళీ మొదటికి వచ్చి మూడవ పేజీనుంచి చదువుకోవాలని సిగ్గుపడుతూ వేడుకుంటున్నాను.

అయితే, పెద్ద మనసుతో బ్లాగరులు నా తప్పును మన్నించి, ముందు వెనకయితే పొరపాటులేదోయ్, వ్యాసం మారిపోలేదోయ్, అని, వ్యాసాన్ని తిప్పిచదువుకుని, తమ అభిప్రాయాన్ని నిక్కచ్చిగా తెలియపరుస్తారని ఆశిస్తున్నాను.

అందరినీ, మరోసారి, క్షమార్పణలు వేడుకుంటున్నాను.

వ్యాసం నాణ్యతను చూసి నన్ను క్షమించేస్తారన్న విశ్వాసంతో   సెలవు.   

Enter Your Mail Address

June 20, 2009 ·  · 3 Comments
Posted in: నా రచనలు.

3 Responses

 1. lyla yerneni - June 20, 2009

  ఒక కవిని మాత్రమే కాదు, జీవించదగిన ఒక శైలిని మాకు పరిచయం చేశారు. చాలా ఆనందం కలిగింది. కవిత్వపు కస్తూరి రాలిందిక్కడ. మీ దస్తూరిని నేను గుర్తుంచుకుంటాను.

  లైలా

 2. అభిమాని - June 21, 2009

  పొరబాట్లు ప్రతి ఒక్కరూ చేస్తారు. కాని అవి తెలుసుకుని సరిదిద్దుకొనేవాడే రాణిస్తాడు. మీరు వ్రాసిన టపాను ఎడిట్ చేసుకునే అవకాశం మీకు ఎప్పుడూ ఉంటుంది.కాబట్టి సిగ్గుపడుతూ వేడుకునే అవసరం లేదు.
  కానీ నా కంప్యూటర్ సాకేంతిక పరిఙ్నాన అఙ్నానికి నా అపీ జాలి తలచి ఇటువంటివి చదివితే చాలామంది మీ కంప్యూటర్ సాంకేతిక పరిజ్ఞాన అజ్ఞానానికి మీ పై జాలి తలవడం మాట అటుంచి మీ బ్లాగువైపుకు రావడం మానేస్తారు జాగ్రత్త.

 3. కస్తూరి మురళీకృష్ణ - June 21, 2009

  లైలా గారు, కృతఙ్నతలు.

  అభిమానిగారూ,

  మీరన్నది నిజమే. కానీ ఎడిట్ చేయటమెలగో ఎంత ప్రయత్నించినా రాలేదు. ముఖ్యంగా, స్కాన్ చేసిన కాగితాలను, చిన్న సైజులో వుంచినా వాటిమీద క్లిక్ చేస్తే అవి పెద్దగయ్యేట్టు పెట్టటం రావటంలేదు. పెద్దగా చేసిపెడితే పేజీ పక్కకు వెళ్ళిపోతోంది. అలాగే, స్కాన్ చేసిన కాగితాలను వరుసగా డౌన్ లోడ్ చేసినా తీరా ప్రచురించేసరికి మూడో పేజీ ముందుకొచ్చింది. దాన్ని వరుసలో తేవటం రాలేదు. ఎవరయినా చెప్పి పుణ్యం కట్టుకుంటే ఈ తప్పు మరోసారి జరుగదు. అచ్చుతప్పులంటారా….. అవివస్తూనేవున్నాయి, నా నీడలా, నా తోడుగా….

Leave a Reply