ఈవారం నా రచనలు-17

నిన్న సభలో వల్లీశ్వర్ గారు, తీవ్రవాదం పుస్తకం గురించి మాట్లాడుతూ, పుస్తకంలో ఆయనకు నిష్పాక్షికత నచ్చిందన్నారు. నా ఫ్రెండొకాయన తాను రెగ్యులర్ గా రివ్యూలు రాసే పత్రికకు తీవ్రవాదం పుస్తక సమీక్షను రాసి తీసుకువెళ్ళాడట. ఆపత్రిక ఎడిటర్ పుస్తకంపై నా పేరును చూడగానే వీడు ఆరెస్సెస్ వాడు. వీడు తీవ్రవాదం గురించి రాస్తే ముస్లీం లను తిట్టటం తప్ప ఏమీ వుండదు, అని పుస్తకాన్ని నా ఫ్రెండు ముఖం మీదకు, సమీక్షను చెత్తబుట్టలోకీ విసిరేశాడట. ఇలా వుంటాయి మన రంగుటద్దాల ఆలోచనలూ, అపోహలూ.

ఈవారం వార్త ఆదివారం అనుబంధంలో బ్లాగ్ స్పాట్ శీర్షికన కెనేడియన్ న్యూ ఏజ్ మ్యూసిక్ గాయని మార్కోమె బ్లాగ్ పరిచయం వుంటుంది.

ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో ఎప్పటి లాగే సగటు మనిషి స్వగతం వుంటుంది. ఈసారి సగటు మనిషికి పెద్ద సందేహమే వస్తుంది. మందార మకరంద మాధుర్యం తెలియనివారి సంగతి ఏమిటన్నదాయన సందేహం.

ఆంధ్రభూమి వార పత్రికలో పవర్ పాలిటిక్స్ శీర్షికలో రాజకీయ విశ్లేషణ వుంటుంది.

గురువారం ఆంధ్రప్రభలోని చిత్రప్రభ అనుబంధంలో పథేర్ పాంచాలి నవలను సినిమాగా మలచటం గురించి చర్చ జరుగుతుంది.

కౌముది మాస పత్రికలో కథాసాగర మథనం వుంటుంది. మే నెలలో విడుదలయిన పత్రికలలోని 95 కథలలోంచి భిన్నంగా వున్న కహల పరిచయం జరుగుతుంది.

ఈభూమి మాస పత్రికలో మహమ్మద్ రఫీ పరిచయం పాడుతా తీయగా శీర్షికన వుంటుంది. నా జీవితంలో ప్రతి క్షణం నా వెంట వుండి తన పాటలతో నన్ను నడిపిస్తున్నాడు రఫీ. అందుకే వ్యాసం తూ ఇస్ తర్హా  సె మెరీ జిందగీమె షామిల్ హై, అన్నపాట తో ఆరంభమవుతుంది.

ఈనెల ఆంధ్రభూమి మాస పత్రికలో శ్రీశ్రీ పైన నేను రాసిన ప్రత్యేక విశ్లేషణాత్మకమయిన వ్యాసం వుంటుంది.

ఒకవైపు సాహిర్, మజ్రూహ్, షకీల్ ల పైన నావి మూడు పుస్తకాలు సిద్ధమవుతున్నాయి. సైన్స్ ఫిక్షన్ కథలు దాదాపుగా సిద్ధం.

ఇవీ ఈవారం నా రచనలు. చదివి మీ అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా తెలపండి.

Enter Your Mail Address

June 28, 2009 ·  · One Comment
Posted in: నా రచనలు.

One Response

Leave a Reply