కోతికొమ్మచ్చి పుస్తకావిష్కరణ సభ విశేషాలు.

పెద్దన్నకు గండపెండేరం ఎలా తొడిగారో నేను చూడలేదు. శ్రీనాథ కవి సార్వభౌముడికి మహా మహా సన్మానాలెలా జరిగాయో నేను చూడలేదు. ఆకాలంలో మహా కవులకు జరిగే సత్కారాలగురించి చదివి, ఊహించుకుని ఈకాలం లో ఎవరికీ ఎలాంటి విలువలేకుండా పోయిందే అని బాధపడుతూండేవాడిని.

రవీంద్ర భారతి కళావేదికపై బాపు రమణలకు జరిగిన సన్మానం, పుస్తకావిష్కరణలు చూసినతరువాత  మనసు అవ్యక్తానందంతో నిండిపోయింది.

ఈకాలంలో, కళాకారులకింత గౌరవం దక్కటం చూడటం నా భాగ్యంగా భావిస్తున్నాను.

అంతకన్నా ఆనందం కలిగించిన విషయం, బయట ప్రజలు ఎగబడి పుస్తకాలు కొనటం. ఇలాంటి దృష్యం ఈ జన్మకు చూస్తాననుకోలేదు.

నాకు ఆనందంతో పాటూ కాస్త అసూయకూడ కలిగింది.

ఎందుకంటే, ఎగబడి పుస్తకాలు కొంటున్నవారంతా నడివయసు, ఆపైన వారే. అంటే, ఇక భవిష్యత్తులో, ఇలా కొనేవారూ, చదివి మెచ్చేవారూ అరుదయిపోతారన్నమాట. కాబట్టి ఇలాంటి అపూర్వమయిన, బహుషా, మళ్ళీ చూడలేని సంఘటనకు నేను సాక్షినయ్యానన్నమాట.

అయితే, ఈసభ మరో విషయాన్ని నేర్పింది.

సభకుముందు కొందరు కళాకారులు బాపు రమణల సినిమా పాటలు పాడారు. దాన్లో మగ గాయకుడు వినోద్ బాల సుబ్రహ్మణ్యంలా పాడీ పాడీ ఏపాట పాడినా అలాగే పాడటం అలవాటయిపోయింది. గొంతు బాగుంది. కానీ, పాటలోని పదాలలో జీవంలేదు.

గాయిని సురేఖ కూడా కళ్ళు పాట తప్ప మిగతా పాటలన్నీ, తేలికగా పాడేసింది.

అయితే, మేము ఎదురుచూసిన పాట నిదురించేతోటలోకి పాడిన అమ్మాయి పాట వింటే శేషేంద్రనేకాదు, మహదేవన్ కూడా మళ్ళీ జన్మలో పాటల జోలికిపోరు. అంత అద్భుతమయిన పాటను ఎలాంటి ఫీలింగ్ లేకుండా ఇంత ఘోరంగా భావ రహితంగా పాడవచ్చని నిరూపించిందా అమ్మాయి. అయితే, పాట మొదట్లోనే, కణ్ణుల్లో నీరు తుడిచి అనగానే నా కళ్ళు వొళ్ళు సర్వం జలదరించి జలదరించి( ఎవరయినా దీన్ని బ్రాహ్మినికల్ ఆటిట్యూడ్ అంటే అనుకోవచ్చు. నాకేమీ బాధ, కష్టము, నష్టమూ లేవు)ఇంకా జలదరిస్తూనేవుంది. ఇలాంటి కార్యక్రమంలో ఏవో పాడాలి కాబట్టి పాడేరు తప్ప హృదయంతో పాడలేదు. కేబీకే మోహన్ రాజ్, గొంతుపోయినా, ఎవరికివారే ఈలోకం పాటను ఎంతో ఫీలింగ్ తో, అద్భుతంగా పాడాడు. అది చాలు ఆతరానికి, ఈతరానికి వున్న వ్యత్యాసాన్ని స్పష్టం చేస్తుంది. ఇప్పటివారికి శరీరం చాలు. దానికే అలంకరణలు చేసి గొప్పవారయిపోతారు. అప్పటివారికి శరీరం కన్నా ఆత్మపైనే దృష్టి. అందుకే అంత ఆత్మానందం కలిగిస్తుంది వారికళ. ఈసభలో రావికొండలరావు, అక్షింతలు అధ్బుతం. మళ్ళీ ఇలాంటి సభ, ఇలాంటి కళాకారులు, ఇలాంటి సన్మానం ఈజీవితకాలంలో చూడలేననే అనుకుంటున్నాను.

సభ విశేషాలు బొమ్మల్లో చూడండి.

  Image020Image024Image025

 

 

 

Image023Image022

 

Image028Image027

Image029

 

Image030

Enter Your Mail Address

June 30, 2009 ·  · 9 Comments
Posted in: పుస్తక పరిచయము

9 Responses

 1. భమిడిపాటి ఫణిబాబు - June 30, 2009

  బ్రాహ్మినికల్ ఆటిట్యూడ్ అని ఏడ్చేవాళ్ళని ఏడవనీయండి–టు హెల్ విత్ దెం. మీరు వ్రాసినది చదువుతూంటే ప్రత్యక్షంగా చూస్తూన్నట్లు ఉంది. ఎవరైనా దయ చేసి వీడియో ని కూడా చూపిస్తే ఇంకా బాగుంటుంది.

 2. rameshsssbd - June 30, 2009

  Sri ramana’s “kothi kommachhi” is excellent. i thinked about title. why ramana garu keep like these kothi kommachhi to this . in my opnion monkey can do all these for her strugle for existance. same thing will be hapened in common man life. there is many of feelings like sorrow, sad, pain,scare, affraid about life,fun,humor, vigour, happy,enjoyment,shareing and many more in common man’s life. all these feelings make commons with his life game “KOTHI KOMMACHHI”. if it is correct ok . not, sorrey sir ramangaru. andarki parandhamudu ayina aa Sri rama chandrudu vari kodalu tho cheppi makuu boledu anni srasa, chamathkara, sogasu ,abba cheppaleni anni mee dwra pathaka lokani prasdinchali.

 3. Chaithanya MS - June 30, 2009

  దీనివెల వగైరాలు చెప్పకుండానే ముగించేశారు సార్.

 4. అరిపిరాల - July 1, 2009

  ఈ పుస్తకం “కొని” చదవాలని నాకూ వుంది..!! ఆంధ్రాలో అడుగుపెట్టగానే నేను చేయబోయే మొదటి పని ఈ పుస్తకం కొనడమే…!! జయహో బాపు రమణ..!!

 5. నాగప్రసాద్ - July 1, 2009

  కోతి కొమ్మచ్చి లాగా మీ బ్లాగులోని ఫోటోలు కూడా అటొకటి, ఇటొకటి ఎగిరిపోయాయే. :)

 6. నాగప్రసాద్ - July 1, 2009

  కోతి కొమ్మచ్చి లాగా మీ బ్లాగులోని ఫోటోలు కూడా అటొకటి, ఇటొకటి జంప్ చేశాయే. :)

 7. తృష్ణ - July 1, 2009

  నాలుగు రోజుల క్రితం నా బ్లాగులొ నిన్నటి సభ గురించి రాసానండి వీలైనవాళ్ళు వెళ్తారని.నాకే కుదరలేదు.మా నాన్నగారు మాత్రం వెళ్ళారు.బాపుగారిని కలుసుకోవాలనే చిరకాల కోరిక నిన్న తీరింది ఆయనకు.బాపుగారి సోదరులు శంకరనారయణగారి ద్వారా.వారు చిరకాల పరిచయస్తులు.
  ఫొటొలు బాగున్నాయి.వెళ్ళలేకపోయిన బాధ తీరింది.

  చైతన్యగారు,పుస్తకం వెల 150/-రు.

 8. ప్రభాకర్ మందార - July 1, 2009

  రావి కొండలరావు గారి అక్షింతలు ఒకటి రెండు చోట్ల శృతి తప్పినట్టనిపించినా … ఎంత విలక్షణంగా వున్నాయో. బాపూ రమణ గార్లతో సహా అశేష ప్రేక్షకులను ఎంతగా అలరించాయో !
  మిమిక్రీ శ్రినవాస్ ఎందుకని రాలేక పోయాడో కాని … ప్రేక్షకులకు ఆయన ఆశాభంగం కలిగించిన దానికంటే … అంత మంది కవులూ కళాకారులూ, రచయితలూ, కళాభిమానుల ప్రశంశలను ఆయన కోల్పోయిందే ఎక్కువ . !!

 9. lalitaa - July 1, 2009

  కోతి కొమ్మచ్చి సభావిశేషాలు చదివి చాలా సంతోషించాను. బ్రాహ్మినికల్ ఆటిట్యూడ్ అన్నవాళ్ళని నేను ఒక్క పశ్న అడగదలుచుకున్నాను. ప్రతిదానికీ ఒక పధ్ధతి అంటూ వుంటుందికదా. 2+2=4 అనే చెప్పాలి. అలాకాకుండా 5 అనిచెపితే తప్పని అందరూ గొంతెత్తి అరవరా. అలాగే సంగీతం లో అపస్వరం పాడితే తప్పు పట్టుకోరా. ఆలాగే ప్రతిపదానికీ పలకవలసిన నిర్దిష్టమైన పధ్ధతిలో పలకకపోతే అది మహాపరాధమే అవుతుంది. చేతకానప్పుడు నేర్చుకోవాలి తప్పితే నింద వేయకూడదు. మీరు సరిగ్గానె చెప్పారు

Leave a Reply