ఈవారం నా రచనలు-21

ఈవారం వార్త ఆదివారం అనుబంధంలో బ్లాగ్ స్పాట్ శీర్షికన సైన్స్ సర్వైవల్ బ్లాగ్ పరిచయం చేశాను. ఇది ఇతర బ్లాగులకు భిన్నమయిన బ్లాగు. ఇందులో రీసెర్చ్ స్కాలర్లకు మంచి సూచనలుంటాయి.

ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో సగటుమనిషికి ఈసారి తరగిపోతున్న చీరల అమ్మకాలగురించి బాధ. టైంస్ పత్రికలో ఒక వ్యాసం వచ్చింది. కొద్దికాలానికి చీర ఇక మ్యూజియంలకే పరిమితమవుతుందని. దానిపై సగటుమనిషి స్వగతం ఈవారం.

ఆంధ్రభూమి వార పత్రికలో పవర్ పాలిటిక్స్ శీర్షికలో భారత పాకిస్తాన్ రాజకీయాలలో బలూచిస్తాన్ బూచి గురించిన విశ్లేషణ వుంటుంది.

ఆంధ్రప్రభ గురువారం అనుబంధం చిత్రప్రభలో నవలలను సినిమాలుగా మలచటం గురించి చర్చ కొనసాగుతుంది. జాన్ ఫోర్డ్ సినిమా హౌ గ్రీన్ వస్ మై వాలీ విశ్లేషణ ఈవారంకూడా వుంటుంది.

ఈభూమిలో రాజ్ కపూర్ పాటల గురించిన వ్యాసంపైన స్పందన అప్పుడే తెలుస్తోంది. అందరికీ నచ్చుతోందది. మీరూ చదివి చూడండి.

ఈనెల చిత్ర మాస పత్రికలో నాకథ ఆనందరావూ-పుస్తకాల అమ్మకాలు అనేకథ వచ్చింది. బుక్ ఎక్జిబిషన్ లోని అనుభవాలకు హాస్య రూప కల్పన ఈకథ. బ్లాగు పాఠకులు ఆ కథను ఇతరులకన్నా బాగా  అర్ధం చేసుకోగలరు.

ఇవీ ఈవారం నా రచనలు. ఇవి చదివి మీ అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా తెలియచేయ ప్రార్ధన.

Enter Your Mail Address

August 8, 2009 · Kasturi Murali Krishna · No Comments
Posted in: నా రచనలు.

Leave a Reply