నిడదవోలు మాలతి గారి సభ!

లేఖిని సంస్థ ఆధ్వర్యంలో త్యాగరాయగానసభ మినీ హాలులో ఒక సభ జరిగిందీవేళ. తెలుగు సాహిత్యాన్ని అంతర్జాతీయస్థాయికి అనువాదాలద్వారా తీసుకువెళ్తున్నందుకు అభినందన సభ ఈసభ.

సభలో వాసా ప్రభావతీ దేవి గారు, సుధామ, పోరంకి దక్షిణామూర్తి గార్లు పాల్గొన్నారు.

మంకలవాటయిన సభల్లో ముందుగా వక్తలు తమ వక్తృత్వ ప్రఙ్నా ప్రావీణ్యాలను సభికుల ఓపిక నశించినా పట్టించుకోకుండా ప్రదర్శిస్తారు. ఆతరువాత రచయిత కుటుంబ సభ్యులు, లైట్లార్పి తాళాలేసుకునేందుకు హాలువారు తప్ప ఎవరూ మిగలని పరిస్థితిలో రచయితను మాట్లాడమంటారు.

ఇందుకు భిన్నంగా, వాసా ప్రభావతిగారు, పోరంకి దక్షిణామూర్తి గారు మాట్లాడగానే నిడదవోలు మాలతిగారిని మాట్లాడమన్నారు.

నిడదవోలు మాలతిగారు చక్కగా మాట్లాడారు. అనువాద రచనల అనుభవాలను పంచుకున్నారు. సాధకబాధకాలను వివరించారు. తన బ్లాగులోని రచనలను కాపాడుకునే బాధ్యత పాఠకులది, రచయితల్ది అన్నారు. అందుకు స్పందించిన లేఖిని వారు, అనువాద కథల పుస్తక ప్రచురణకు ప్రయత్నిస్తామన్నారు. దక్షిణామూర్తిగారు, తన వంతుగా 1116/- ప్రతి పుస్తకానికీ ఇస్తామని వాగ్దానం చేశారు.

తరువాత మాలత్గారికి ఙ్నాపికను అందించారు.

సభలో మాలతిగారు, బ్లాగులను, బ్లాగర్లను ప్రస్తావించారు.

అయితే, సభకు రెండురోజులముందే మాలతిగారిని సుజాతగారింట్లో కలిసినప్పుడు ఒక విషయం అర్ధమయింది.

తెలుగు రచయితలు, అమెరికాలోవున్నా, ఆంధ్రప్రదేశ్ లో వున్నా, ఏ ఉద్యమాలకు, గుంపులకు చెందకపోతే వారి బాధలన్నీ ఒకేరకం.  అందుకే మాలతి గారిని కలిసిన తరువాత ఇంటికి వెళ్తూంటే సాహిర్ పాటలోని పంక్తులు మాటి మాటికీ గుర్తుకువచ్చాయి.

అప్నా సుఖ్ భీ ఏక్ హై సాథీ, అప్నా దుఖ్ భీ ఏక్
అప్నీ మంజిల్ సచ్ కీ మంజిల్, అప్నా రస్తా నేక్.

మన సుఖ దుహ్ఖాల స్వరూపమొక్కటే. మన గమ్యం సత్యం. మన దారికి స్వచ్చం.

కాబట్టి ఆపాటలో సాహిర్ చెప్పినట్టు, ఏ ఉద్యమాలకు, సిద్ధాంతాలకు, గుంపులకు చెందని రచయితలంతా, సాథీ హాథ్ బఢానా, ఏక్ అకేలా థక్ జాయేగా, మిల్ కర్ బోఝ్ ఉఠానా( ఒంటరిగా ఒక్కరే బరువు ఎత్తటం కష్టం. ఒకరికొకరు చేయి చేయి కలిపి సమిష్టిగా బరువుమోయాలి) అని కలవాలి. సాహిత్యాన్ని బ్రతికించాలి. అందుకు, మాలతిగారి రచనలను రచయితలంతా కలసి ప్రచురించటమనే చర్య ప్రేరణ అవుతుందేమో చూద్దాం.

సభ విశేషాలు ఫోటోల్లో…..

Image000Image014Image007Image008

Enter Your Mail Address

August 11, 2009 · Kasturi Murali Krishna · 7 Comments
Tags: , ,  · Posted in: సభలూ-సమావేశాలు.

7 Responses

 1. Malakpet Rowdy - August 11, 2009

  ఇంతకీ ఈ సభకి రంగనాయకమ్మగారిని ఆహ్వానించారా లేదా?

 2. రమణి - August 11, 2009

  ” మన సుఖ దుఃఖాల స్వరూపమొక్కటే. మన గమ్యం సత్యం. మన దారికి స్వచ్చం.”

  100% కరెక్ట్.

  టెప్లెట్ బాగుంది. కలర్ మార్చలేరా? బ్లాక్ చదువరులకు ఇబ్బందేమో…”

 3. సుజాత - August 11, 2009

  ” మన సుఖ దుఃఖాల స్వరూపమొక్కటే. మన గమ్యం సత్యం. మన దారికి స్వచ్చం.” భలేగా చెప్పారు.

  కానీ మాలతి గారి రచనలను ఇంకా బాగా చదివి ఆకళింపు చేసుకున్న వారెవరైనా మాట్లాడి ఉంటే బాగుండేదని నాకు అనిపించింది. ప్రసంగాలు సమగ్రంగా లేవు. (మాలతి గారిది తప్పించి) కేవలం రెండు రోజుల క్రితం ఆమె బ్లాగు, వెబ్ సైటు చదివి, కాకుండా!

  “ఏ రోజయితే తూలిక డొమైన్ కు డబ్బు కట్టలేకపోతానో,ఆ రోజు తూలికలోని కథలు, వ్యాసాలు అన్నీ లేకుండా పోతాయేమో”అన్న మాలతి గారి ఆవేదన పట్టించుకోదగిందనిపించింది నాకు. తూలిక లో అనువాదాల రూపంలో ప్రచురించబడిన కథల తాలూకు రచయితలు పూనుకుంటే అవి ఒక పుస్తక రూపం దిద్దుకోలేకపోవు. అప్పుడు అందులో నా పాత్ర కూడా ఉంటుంది. నా కథలు రెండింటిని అనువదించారు మాలతి గారు!

 4. సుజాత - August 11, 2009

  ఇంకోటి,
  మాలతి గారి అనువాదాల గురించి తప్ప అక్కడ ఎవరూ ఆమె తెలుగు సాహిత్యానికి చేసిన సేవ గురించి కానీ, తెలుగులో రాసిన కథల గురించి కానీ ప్రస్తావించకపోవడం అసంతృప్తి కల్గించింది.

 5. జాల+అరి - August 11, 2009

  నలుపు అంత బాలేదు. ముఖ్యంగా ఈ రంగు తెలుగక్షరాల గుండ్రదనాన్ని చెడగొట్టి ప్రదర్శిస్తుంది.

 6. Sowmya - August 11, 2009

  More detailed comments needed :)
  I was not at Hyd and so did not attend this.
  సుజాత గారూ…మీరూ రాయండి ఐతే… ఈ సభ గురించి.

 7. కొత్తపాళీ - August 12, 2009

  చాలా సంతోషం మురళీ కృష్ణ గారూ. బాగుంది మీ నివేదిక, ఫొటోల్తో సహా.

  మంచి పాయింత్లు లేవనెత్తారు. నెహ్రూగారి అలీనోద్యమంలాగా తెలుగు రచయితల అలీనోద్యమం ఒకటి మొదలెడదాము. ఏ ఇజానికీ చెందని రచయితలారా, మా నిజంలో భాగస్వాములు కండీ అని .. హాస్యానిక్కాదు, నిజంగానే అంటున్నా.

  నలుపు మీద తెలుపు అక్షరాలు చదివేందుకు చాలా కష్టంఘా ఉంది సార్.

Leave a Reply