పుస్తకావిష్కరణ సభకు ఆహ్వానం!

ఈ శనివారం, అంటే 29.08.2009 నాడు, సాయంత్రం ఆరుగంటలకు, త్యాగరాయగానసభ మినీ హాలులో నేను రచించిన, పాప్ ప్రపంచానికి రారాజు, మైకెల్ జాక్సన్, అనే పుస్తకావిష్కరణ సభవుంది.

ఈ సభకు బ్లాగరులందరికీ ఇదే నా ఆత్మీయపూర్వక ఆహ్వానం!

పుస్తకాన్ని శ్రీ ఈలపాట శివప్రసాద్ గారు ఆవిష్కరిస్తారు.

ఆంధ్రప్రభ సంపాదకులు శ్రీ విజయబాబుగారు పుస్తకాన్ని పరిచయం చేస్తారు.

హాసం క్లబ్ ఆధ్వర్యాన జరిగే ఈ సభలో ఎస్వీరామారావుగారు కూడా పాల్గొంటారు.

సభానంతరం, నేను సమర్పించే కిషోర్ కుమారె స్మృత్యంజలి కూడా వుంటుంది.

ఎట్టి పరిస్థితులలో సభ రాత్రి 8.30 లోపల అయిపోతుంది.

కాబట్టి అందరూ వీలు చేసుకుని రావాలి. సభను జయప్రదం చేయాలి.

Enter Your Mail Address

August 26, 2009 · Kasturi Murali Krishna · 2 Comments
Posted in: నా రచనలు.

2 Responses

  1. Dr.Darla - August 27, 2009

    mee krushiki chAlA Anandistunnaanu. bAgA rAstunnAru. shubhAkAnkshalu.
    mee
    darla

  2. కొల్లూరి సోమ శంకర్ - August 28, 2009

    అదేరోజు ఉదయాన్నే నేను ఆఫీసు పనుల నిమిత్తం ఢిల్లీ వెడుతున్నాను. కాబట్టి మీ సభకు రాలేను. కార్యక్రమం విజయవంతమవ్వాలని కోరుకుంటున్నాను.

Leave a Reply