మైకెల్ జాక్సన్ పుస్తకావిష్కరణ సభ విశేషాలు!

అనుకున్నట్టుగానే 29.8.09 సాయంత్రం మైకెల్ జాక్సన్ పుస్తకావిష్కరణ సభ జరిగింది. బాగా జరిగింది.

ఆంధ్రప్రభ ఎడిటర్ విజయబాబుగారు చివరి క్షణంలో పనిరావటం వల్ల రాలేకపోయారు.

అనుకోకుండా డాక్టర్ సీ నారాయణ రెడ్డి గారు సభకు వచ్చారు.

అస్సలనుకోకుండా మైకెల్ జాక్సన్ ఫైబెర్ విగ్రహాన్ని తయారుచేసిన దేవికారాణిగారు విగ్రహంతో సహా సభకు వచ్చారు.

ముఖ్యంగా, పుస్తకం ముందుమాటలో నేను నారాయణ రెడ్డి గారు రచించిన పాటలోని పంక్తులను ఉదాహరించటం, ఆ సభలో వారేవుండటం చాలా గమ్మత్తుగా, అద్భుతంగా అనిపించింది.

ఆవిష్కరణ తరువాత పొట్టి వీరయ్యకు సన్మానం జరిగింది.

ఆతరువాత కిషోర్ కుమార్ యాదోం కీ బారాత్ కార్యక్రమాన్ని సమర్పించాము. అందరికీ చాలా నచ్చిందీ కార్యక్రమం.

నారాయణ రెడ్డి గారు శ్రద్ధగా విని ఆనందించటమే కాదు, మధ్య మధ్యలో సందేహాలు అడిగి తెలుసుకున్నారు. చివరికి స్వచ్చందంగా ఆయన కొన్ని అనుభవాలను వినిపించారు.

ఇలా హాయిగా, ఆనందంగా, ఆడుతూ, పాడుతూ సభ గడచింది.

సభ వివరాలు, ఫోటోల్లో….

Image012Image013

Image016

Image020Image021

Image022Image023

Image024Image025

Image026Image027

Image028Image029

Image030Image031

Image032Image035

Image036Image037

Image038Image040Image041Image042Image043Image044

Enter Your Mail Address

August 29, 2009 · Kasturi Murali Krishna · 3 Comments
Tags: , ,  · Posted in: నా రచనలు.

3 Responses

  1. cbrao - August 29, 2009

    సభ బాగా జరిగినందుకు ప్రమోదం. మంచి కార్యక్రమాన్ని మిస్ అయ్యాను. మన బ్లాగరు మిత్రులెవరైనా వచ్చారా? మీ బ్లాగు టైటిల్ లోని చిత్రాలను సరైన విధంగా సరిదిద్దగలరు.పాఠకులు follow-up వ్యాఖ్యలు అందుకునేలా వెబ్ సైట్ లో సౌకర్యం కల్పించగలరు.

  2. సుజాత - August 29, 2009

    మిస్ అయిపోయానడీ! ఎంతగా ప్రయత్నించినా కుదరలేదు. సభ బాగా జరిగినందుకు సంతోషంగా ఉన్నా, ప్రేక్షకుల్లో లేనందుకు బాధగానే ఉంది. అభినందనలు!

  3. sarojini - September 6, 2009

    Great to hear everything went perfect. Excellent pictures, can`’t wait for the book.

Leave a Reply