హాసం సభ విశేషాలు!

ప్రతి నెల చివరి శనివారం, త్యాగరాయ గాన సభ మినీ హాలులో హాసం సభ్యుల సమావేశం జరుగుతుంది. ఇందులో జోకులు, పాటలు వుంటాయి. ఈసారి సభలో విన్నకోట మురళీ కృష్ణ గారిని నారాయణ రెడ్డి గారు సన్మానించారు. విన్నకోట గారు లలిత సంగీతం గురించి సోదాహరణంగా వివరించారు. తరువాత నేను రాధాకృష్ణ గారూ ముకేష్ కు స్మృత్యంజలి సమర్పించాము. మా కార్యక్రమం అందరినీ అలరిస్తోందని సభలో పెరుగుత్న్న సంఖ్య నిరూపిస్తోంది. సభ యిన తరువాత మమ్మల్ని చుట్టుముట్టి అభినందనలు, సూచనలు ఇస్తున్న వారి ఉత్సాహం మా కార్యక్రమం ఎంతగా అలరిస్తోందో తెలుపుతోంది. అందుకే కార్యక్రమ నిర్వహణలో మారింత శ్రద్ధ తీసుకుంటున్నాను. ప్రేక్షకులు మా కార్యక్రమం కోసం చివరివరకూ వుండడం ఆనందన్ని కలిగిస్తోంది. ఈసారి సభకు అద్దేపల్లి రామమోహనరవుగారు వచ్చి, అభినందించారు. ప్రతినెలా తప్పకుండా వచ్చి మా కార్యక్రమాన్ని చూస్తానన్నారు.

వచ్చేనెల 22న షమ్మికపూర్ పుట్టిన రోజు. ఆ సందర్భంగా షమ్మికపూర్, తుం ముఝే యూన్ భులానపావోగే, అన్న కార్యక్రమాన్ని రూపొందిస్తున్నాను. అందరూ వచ్చి అభిప్రాయాన్ని తెలపాలి.

నిన్నటి కార్యక్రమ వివరాలు ఫోటోల్లో….

Image031

Image021

Image012Image013Image020Image032

Image001

Enter Your Mail Address

September 27, 2009 · Kasturi Murali Krishna · 3 Comments
Posted in: సభలూ-సమావేశాలు.

3 Responses

  1. ధరణీరాయ్ చౌదరి - September 27, 2009

    విజయదశమి శుభాకాంక్షలు

  2. M.V.AppaRao - September 27, 2009

    హాసం క్లబ్ విశేషాలు చదివి ఆనందించాను.నేను కూడా ఇక్కడ
    రాజమండ్రి లో2004 ఉగాది నుండి హాసం క్లబ్ నేను మా మితృలు
    డీ.వి.హనుమంతరావు,యమ్డి.ఖాదర్ ఖాన్ లతోకలసి ప్రతి నెలా
    మూడవ ఆదివారం క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నాము.శ్రీ యం.బి.యస్.
    ప్రసాద్ గారు,యస్.వి.రామారావు గారు ప్రారంభించారు.గత ఏడాది శ్రీ కెఐ.
    వరప్రసాద రెడ్డి,యంబియస్.ప్రసాద్,గార్ల అధ్వర్యంలో వార్షికొత్సవం నిర్వహించి,
    హాస్యనటులు శ్రీ రావి కొండలరావు గారిని సత్కరించాము.నా సురేఖార్టూన్స్
    పుస్తకం,రావికొండలరావుగారి పుస్తకం (సి)నీతిచంద్రిక శ్రీ వరప్రసాద్రెడ్డిగారిచే
    అవిష్క్రరించబడ్డాయి.
    యంవీ.అప్పారావు(సురేఖ)

  3. కోడీహళ్లి మురళీమోహన్ - September 27, 2009

    మీకు విజయదశమి పర్వదినము సందర్భంగా నా హృదయపూర్వక శూభాకాంక్షలు!!!

Leave a Reply