నా గురించి

నా పేరు కస్తూరి మురళీకృష్ణ. నేను ఎం.ఎస్సీ, ఎం ఎ చదివాను. రచన నా ప్రవృత్తి.

Jack of all - Master of none అనే సిద్ధాంతానికి నేను వ్యతిరేకం.  Jack of none - Master of all అని నమ్మే వ్యక్తిని. అందుకే తెలుగు సాహిత్యంలో ఉన్న వీలైనన్ని ప్రక్రియలలో రచనలు చేయాలని ప్రయత్నిస్తున్నాను.  విభిన్నాంశాల ఆధారంగా రచనలు చేస్తున్నాను.
1995లో ఆంధ్ర ప్రభ ’దీపావళి ‘ నవలల పోటీలో నా ‘అంతర్యాగం ‘ నవలకు ద్వితీయ బహుమతి, 1990లో ఆంధ్ర భూమి సస్పెన్స్ నవలల పోటీలో నా ‘ఆపరేషన్ బద్ర్ ‘ నవలకు ప్రత్యేక బహుమతి లభించాయి. అసిధార, అంతర్మధనం, మర్మయోగం నవలలు పుస్తక రూపంలో వచ్చాయి.  జీవితం – జాతకం, 4 x 5 , రాజతరంగిణి కథలు వంటి సంకలనాలు కూడా పుస్తక రూపంలో వచ్చాయి. 

భారతీయ తత్వ చింతన, మన ప్రధాన మంత్రులు, మన ముఖ్య మంత్రులు , 1857-మనం మరవ కూడని మహా యుద్ధం,పుస్తక రూపంలోకి వచ్చిన కాల్పనికేతర రచనలు.

ఇవికాక, 2001 నుంచి ఆంధ్ర భూమి వార పత్రికలో ‘పవర్ పాలిటిక్స్ శీర్షిక వారం వారం రాస్తున్నాను. పద్మ పేరిట అక్షరాంజలి శీర్షికన World’s Claasics ను తెలుగు పాఠకులకు పరిచయం చేస్తున్నాను.  వారం విడిచి వారం, వార్త దినపత్రిక ఆదివారం అనుబంధం లో  రియల్ స్టోరీస్ పేరిట మానవతా విలువలున్న కథలు పాఠకులకు అందిస్తున్నాను. జాగృతి వార పత్రికలో భారతీయ తత్వచింతన ఆధారంగా, ఆధునిక సమాజానికి ‘వ్యక్తిత్వ వికాసం ‘ శీర్షిక  అయిపోయింది.ఇప్పుడు రామ కృష్ణ మఠం వార్ దీన్ని పుస్తకంగా ప్రచురిస్తున్నారు.. చివరి వారం ‘కథసాగర మధనం ‘ శీర్షికన ఆ నెల ప్రచురితమయ్యే కథాకథన విశ్లేషణ జరుపుతున్నాను.  రసమయి మాస పత్రికలో హిందీ సినీ గేయ రచయితలు తమ పాటల్లో చూపిన చమత్కారాలను విశ్లేషించి, వివరిస్తున్నాను.దివ్య ధాత్రి అనే మాస పత్రికలో “ద్రష్ట” అనే చారిత్రాత్మక సీరీల్ వస్తోంది.ఇదే పత్రికలో,వ్యక్తిత్వాలను వివరించే కథలు వస్తున్నాయి.జాగృతి లో కొత్తగా మన సినిమాలలో మార్పుల గురించి శీర్షిక ఆరంభమయింది.ఆంధ్ర ప్రభ దిన పత్రికలో ప్రతి గురు వారం సినిమా సినెమా శీర్షికన సినిమాల గురించి వివరిస్తున్నాను.  

ఇవికాక, టివి స్క్రిప్ట్లు రాస్తున్నాను. కస్తూరి ప్రచురణలు  స్థాపించి ఉత్తమ సాహిత్యాన్ని  పుస్తక రూపంలో అందిస్తున్నాను.
ప్రస్తుతానికి ఇంత పరిచయం చాలనుకుంతున్నాను. మున్ముందు చెప్పుకోడానికి ఇంకా బోలెడంత ఉందిగా!

15 Responses

  1. Nageswara Rao (Mama) - September 15, 2007

    good evening boss,

    As you told today, i opened your blog and feels happy. Wish you best of luck. But the telugu script is not clear.

    Ok see you at Nanded next week. Bye

  2. santhosh - September 20, 2007

    Your profile is good and I wish you all the best for all future endevors.

    Regards,
    Santhosh

  3. narasimha rao mallina - June 9, 2008

    మీ పరిచయం బాగుంది.మీ బ్లాగులోనివి చదవాలనిపించేలా వుంది.తీరిగ్గా చదువుతాను.

  4. Rambabu - July 8, 2008

    Boss, If you are a writer, go and write some novels but don’t comment badly on any movies. Stop blogging and goto home.

  5. lpunnamma - October 11, 2008

    your writings telling about you

  6. kavindra - October 18, 2008

    your postings are nice. nenu kuda telugulo mee postings ki response ivvalani anukunnanu. but i dont know how? any way your postings are really nice.

  7. swaralasika - October 22, 2008

    మిత్రమా! మీ బ్లాగ్ చూసాను. పూర్తిగా చదివి నా అభిప్రాయం చెబుతాను. ఈ లోగా నా కథా జగత్ కు ఒక మంచి కథ ను పంపండి.

  8. swaralasika - October 22, 2008

    ఇంతకు ముందు పంపిన మెసేజ్ లో నా బ్లాగ్ అడ్రస్ తప్పుగా రాశాను. సరి చూసుకొండి.

  9. durgeswara - December 4, 2008

    lalitaa paaraayana yaagam praarambhamavutunnadi. bloglo vivaraalu choodamdi
    durgeswara.blogspot.com

  10. srinivas - December 6, 2008

    I felt very happy reading your blog as it is very similar to my site “www.elitesrinivas.blogspot.com”.
    Please go ahead writing these types of blogs to inspire and motivate the people like me.

  11. Madhusudhan - January 8, 2009

    It is very nice to see your work on this blog

    Madhusudhan

  12. venkatesh - February 9, 2009

    chaalaa baagundli.

  13. దుప్పల రవికుమార్ - April 22, 2009

    మీ ఈ-చిరునామా తెలపగలరా?

  14. nutakki raghavendra rao - May 21, 2009

    మురలి క్రిష్ణ గారూ ,అభినందనలు.
    బాల్యం నుంచి పుస్తకాల ప్రాముఖ్యత గురించి పెద్దలో ఇష్తమైన వుపాధ్యాయుడో చెబితె ,వాళ్ళు,పాటిస్తూ,పుస్తక సమీకరణకు ప్రాముఖ్యమిస్తుంటే పిల్లలు కూడా పుస్తకాలు కొని చదవడానికి అలవాటు పడతారు.కనీసం గ్రంధాలయాలు అందుబాటులొ వున్నా చాలు. కానీ మన దౌర్భాగ్యానికి అవి అందని చిటారు కొమ్మ పళ్ళు.

    ఒక పుస్తకం, ఒక బ్రష్షు , ఒక మ్యుజికల్ ఇన్స్త్రుమెంట్, ఒక బ్యాటు అందుబాటులొ పెడితె పిల్లలు అన్నిటిని వాడటానికి ప్రయత్నించి వారికి అనువుగా వున్న దానిని ఎన్నుకొని ఆ రంగంలొ ప్రావీణ్యత పొందుతారు.

    మనలొ ఎంతమంది పెద్దాలం యీ విషయమై పిల్లల్ని ప్రొత్సహిస్తున్నాం ? ఒక సారి యీ పుస్తకం చదివె కల్చర్ పిల్లలకు ఏర్పడితె కాఫీ తాగె దానికన్న పుస్తకాలు కొని త్రాగేందుకే ఇష్ట పడతారు.

  15. sarojini - September 6, 2009

    Very good itroduction. May be you can write about your hobbies, interests etc (apart from writing)

Leave a Reply