ఈవారం నా రచనలు-27

ఈమధ్య అటు ఆఫీసులో ఇటు ఇంట్లో ఎంత బిజీగా వుంటున్నానంటే సరిగ్గా కంప్యూటర్ ముందు కూచునే తీరిక వుండటంలేదు. ఈవారం నా రచనల వివరాలు చెప్పేముందు కొన్ని వేరే విషయాలు టూకీగా చెప్తాను. ఈమధ్య వనితా టీవీలో ప్రతి శుక్రవారం రాత్రి 10-30గం లకు వచ్చే వెండితెర వెన్నల కార్యక్రమానికి స్క్రిప్టు రాస్తున్నాను. విజువల్స్ విషయంలో సూచనలు ఇస్తున్నాను. గత మూడువారాలుగా కార్యక్రమం మెరుగయిందని ఫీడ్ బాక్ వస్తోంది. సమయం కాస్త ఇబ్బంది కరంగా వున్నా ఓపిక చేసుకుని చూసి మీ సూచనలు తెలియపరచండి. ఇంతవరకూ శ్రీ 420, సత్యజిత్ రాయ్ దేవి, జోధా అక్బర్ సినిమాలను పరిచయం చేశాను. నిన్న చేగువేరా గురించి స్టూడియో ఎన్ లో ఒక చర్చ కార్యక్రమంలో పాల్గొన్నాను. మైకెల్ జాక్సన్ పుస్తకమేకాదు, అక్షరాంజలి, రియల్ స్టోరీ, తీవ్రవాదం పుస్తకాలు బాగావున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అమ్మకాలు కూడా ప్రోత్సాహకరంగానే వున్నాయి. ఈసారి వార్త ఆదివారం అనుబంధంలో దాదాఫాల్కే అవార్డు గ్రహీత మన్నాడే పైన కవర్ స్టోరీ వుంటుంది. హిందీ గాయకుడిపై కవర్స్టోరీ తెలుగు పత్రికలు చేయటం నాకు తెలిసి చాలా అరుదు. ఆంధ్రప్రభలో సగటుమనిషి స్వగతం వుంటుంది. వార్త బ్లాగ్ స్పాట్ శీర్షికలో పర్యావరణ బ్లాగు climate progress నడుపుతున్న జో రోం బ్లాగు పరిచయం వుంటుంది. ఆంధ్రభూమి వార పత్రికలో పవర్ పాలిటిక్స్ శీర్షికన రాజకీయ విశ్లేషణ వుంటుంది. గురువారం చిత్రప్రభలో నవలలనుంచి సినిమాల రూపాతరం చర్చ సాగుతుంది. ఈనెల ఈభూమిలో గాయకుడు ముకేష్ పరిచయం వుంటుంది. పత్రిక మార్కెట్ లో వుంది. కౌముదిలో కథాసాగరమథనం వుంటుంది. ఈవారం నవ్య వార పత్రికలో నేను రాసిన హారర్ స్టోరీ ఊర్మిళ ప్రచురితమయింది. చదివి మీ అభిప్రాయం చెప్పండి. సైన్స్ ఫిక్షన్ కథలు, పవర్ పాలిటిక్స్ శీర్షికన భారతీయ రాజకీయ సమస్యల విశ్లేషణల సంకలనాలు తయారవుతున్నాయి. త్వరలో విడుదలవుతాయి. హాసం ప్రచురణల వారు ముద్రిస్తున్న సాహిర్ పాటల విశ్లేషణ ( రసమయి సీరియల్) తయారీ చివరి దశలో వుందని తెలిసింది. వచ్చే హాసం సమావేశానికి పుస్తకం విడుదల కావచ్చు. ఈసారి హాసం సమావేశాంలో షమ్మీ కపూర్ పాటల గీత మాలిక తుం ముఝే యూన్ భులానపావోగే కార్యక్రమం సమర్పిస్తున్నాను. దానికి తయారీలోవున్నాము. ఇవీ ఈవారం నా రచనల వివరాలు. చదివి మీ అభిప్రాయాన్ని తెలపండి.

October 10, 2009 · Kasturi Murali Krishna · No Comments
Tags: , , , , , , , , , ,  · Posted in: నా రచనలు.

ఈవారం నా రచనలు-25

ఈవారం వార్త ఆదివారం అనుబంధంలో బ్లాగ్ స్పాట్ శీర్షికన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి వెబ్ సైట్ పరిచయం వుంటుంది.

సగటుమనిషి స్వగతం శీర్షికన ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో వీఐపీల విలాపం వుంటుంది, అది చదవండి ఇక్కడ.

ఈవారం ఆంధ్రభూమి వారపత్రికలో పవర్ పాలిటిక్స్ లో అంబానీల గ్యాస్ వార్ విశ్లేషణ వుంటుంది.

ఆంధ్రప్రభ గురువారం చిత్రప్రభలో సినీ చిత్రాలు శీర్షికన మదాం బోవరీ నవలను సినిమాగా మలచటం గురించిన విశ్లేషణ వుంటుంది.

ఈనెల ఈభూమిలో పాడుతా తీయగా శీర్షికన షమ్షాద్ బేగం పాటల గురించిన వ్యాసం వుంటుంది.

కౌముది నెట్ పత్రికలో కథాసాగరమథనం శీర్షికన 92 కథలనుండి ఎంచుకున్న భిన్నమయిన కథల విశ్లేషణ వుంటుంది.

మైకెల్ జాక్సన్ పుస్తకం బాగానే అమ్ముడవుతోంది. ఫీడ్ బాక్ కూడా బాగానే వుంది. విశేషమేమిటంటే అది చదివిన తరువాత ప్రఖ్యాత రచయిత్రి రంగనాయకమ్మగారు స్వయాన ఫోనుచేసి చాలాసేపు మాట్లాడారు. ఇదిచాలు నా పుస్తకానికి సాహిత్యాకాడెమీ బహుమతికన్నా మిన్న ఇది.

వొచ్చే ఆదివారం శ్రీకాకుళంలో తీవ్రవాదం, మైకెల్ జాక్సన్ పుస్తకాల సభ జరుగుతుంది. వివరాలు త్వరలో!

పవర్ పాలిటిక్స్ వ్యాసాల ఆధారంగా మరో పుస్తకం తయారవుతోంది. ఇందులో మన దేశాన్ని పట్టి పీడిస్తున్న అనేక సమస్యలగురించి రాసిన వ్యాసాలుంటాయి. మత రాజకీయాలు, కుల రాజకీయాలు, నీటి రాజకీయాలు, సంకుచితవాదాలు ఇలా……

ఇవీ ఈవారం నా రచనల వివరాలు. చదివి మీ అభిప్రాయాన్ని ఇర్మోహ్మాటంగా తెలియచేయండి.

September 5, 2009 · Kasturi Murali Krishna · No Comments
Tags: , , , , , , , , , ,  · Posted in: నా రచనలు.