మైక్రో ఫైనాన్స్ పవర్ పాలిటిక్స్……..

మైక్రో ఫైనాన్స్ పవర్ పాలిటిక్స్……..

ఇది 18.11.2010 నాటి ఆంధ్రభూమి వార పత్రికలో పవర్ పాలిటిక్స్ శీర్షికన ప్రచురితమయింది.

November 12, 2010 · Kasturi Murali Krishna · 2 Comments
Tags: , , , ,  · Posted in: Uncategorized, పవర్ పాలిటిక్స్.

ఈవారం నా రచనలు-25

ఈవారం వార్త ఆదివారం అనుబంధంలో బ్లాగ్ స్పాట్ శీర్షికన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి వెబ్ సైట్ పరిచయం వుంటుంది.

సగటుమనిషి స్వగతం శీర్షికన ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో వీఐపీల విలాపం వుంటుంది, అది చదవండి ఇక్కడ.

ఈవారం ఆంధ్రభూమి వారపత్రికలో పవర్ పాలిటిక్స్ లో అంబానీల గ్యాస్ వార్ విశ్లేషణ వుంటుంది.

ఆంధ్రప్రభ గురువారం చిత్రప్రభలో సినీ చిత్రాలు శీర్షికన మదాం బోవరీ నవలను సినిమాగా మలచటం గురించిన విశ్లేషణ వుంటుంది.

ఈనెల ఈభూమిలో పాడుతా తీయగా శీర్షికన షమ్షాద్ బేగం పాటల గురించిన వ్యాసం వుంటుంది.

కౌముది నెట్ పత్రికలో కథాసాగరమథనం శీర్షికన 92 కథలనుండి ఎంచుకున్న భిన్నమయిన కథల విశ్లేషణ వుంటుంది.

మైకెల్ జాక్సన్ పుస్తకం బాగానే అమ్ముడవుతోంది. ఫీడ్ బాక్ కూడా బాగానే వుంది. విశేషమేమిటంటే అది చదివిన తరువాత ప్రఖ్యాత రచయిత్రి రంగనాయకమ్మగారు స్వయాన ఫోనుచేసి చాలాసేపు మాట్లాడారు. ఇదిచాలు నా పుస్తకానికి సాహిత్యాకాడెమీ బహుమతికన్నా మిన్న ఇది.

వొచ్చే ఆదివారం శ్రీకాకుళంలో తీవ్రవాదం, మైకెల్ జాక్సన్ పుస్తకాల సభ జరుగుతుంది. వివరాలు త్వరలో!

పవర్ పాలిటిక్స్ వ్యాసాల ఆధారంగా మరో పుస్తకం తయారవుతోంది. ఇందులో మన దేశాన్ని పట్టి పీడిస్తున్న అనేక సమస్యలగురించి రాసిన వ్యాసాలుంటాయి. మత రాజకీయాలు, కుల రాజకీయాలు, నీటి రాజకీయాలు, సంకుచితవాదాలు ఇలా……

ఇవీ ఈవారం నా రచనల వివరాలు. చదివి మీ అభిప్రాయాన్ని ఇర్మోహ్మాటంగా తెలియచేయండి.

September 5, 2009 · Kasturi Murali Krishna · No Comments
Tags: , , , , , , , , , ,  · Posted in: నా రచనలు.

ఈవారం నా రచనలు-24

ఈవారం వార్తలో బ్లాగ్ స్పాట్ శ్ర్ర్షికన ఇంగ్లాండ్ ప్రధాని గార్డన్ బ్రౌన్ బ్లాగ్ పరిచయం వుంటుంది.

ఆంధ్రప్రభలో సగటు మనిషికి ఓ సందేహం వస్తుంది. గుడికి వెళ్ళటాన్ని తప్పుగా, చులకనగా చూస్తారెందుకన్నది సగటుమనిషి సందేహం.ఇప్పుడు ఆంధ్రప్రభను నెట్ లో కూ డా చూడవచ్చు. www.andhraprabha.com

ఆంధ్రభూమి వారపత్రికలోని పవర్ పాలిటిక్స్ శ్ర్ర్షికన ఈవారం చదువుల పవర్ పాలిటిక్స్ విశ్లేషణ వుంటుంది.

గురువారం ఆంధ్రప్రభ చిత్రప్రభలో నవలలను సినిమాలుగా మలచటం గురించి చర్చ కొనసాగుతుంది. నా కొత్త పుస్తకం విడుదలవుతోంది.

ఆగస్ట్ 29 న త్యాగరాయ గాన సభ మినీ హాలులో నేను రాసిన డైరెక్ట్ జీవిత చరిత్ర విడుదలవుతోంది. ఇంతకీ నేను రాసిందెవరి జీవితచరిత్రనో ఊహించండి?

ఒక క్లూ… ఆరోజే అతడి పుట్టినరోజు!

వివరాలు త్వరలో!!11

August 22, 2009 · Kasturi Murali Krishna · No Comments
Tags: , , , , , ,  · Posted in: నా రచనలు.

ఈవారం నా రచనలు-18

ఈవారం చాలా బిజీ బిజీగా గడచింది.

ఆఫీసులో కూడా చాలా పనివుండటంతో, రాత పనులు ఇంకా వుండటంతో కంప్యూటర్ దగ్గరకు వచ్చే తీరిక లభించలేదు.

ఈవారం నేనో పుస్తకం రాశాను. అది అతి త్వరలో విడుదలవుతుంది. పుస్తకం వివరాలు ఇప్పుడే చెప్పటంలేదెందుకంటే, ఇది తిన్నగా పుస్తక రూపంలోనే వస్తోంది. విడుదలయ్యేవరకూ ఎవ్వరికీ పుస్తకం గురించి తెలియకూడదని ప్రచురణకర్త ఆదేశాలు.

ఈవారం వార్తలో బ్లాగ్ స్పాట్ శీర్షికలో అరుంధతీరాయ్ బ్లాగు పరిచయం వుంటుంది. రంగుటద్దాల మేధావులకు ఆమె ప్రతీక. ఆమె బ్లాగు అందుకు నిదర్శనం.

ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో సగటు మనిషికీసారి మరో సందేహం వచ్చింది. అవినీతి ఆరోపణలక్రింద ఎప్పుడూ వంద వెయ్యి తీసుకునేవారే పట్టుబడతారుకానీ, లక్షలు, కోట్లు తీసుకునేవారెందుకు పట్టుబడరన్నది అతడి సందేహం.

ఆంధ్రభూమి వార పత్రికలో పవర్ పాలిటిక్స్ శీర్షికన రాజకీయ విశ్లేషణ సాగుతుంది.

గురువారం ఆంధ్రప్రభ అనుబంధం చిత్రపభలో సినీసిత్రాలు శీర్షికన సినిమాలుగా మారిన నవలల చర్చ కొనసాగుతుంది. ఈసారి చర్చ ఆర్ కే నారాయణ్ నవల గైడ్ సినిమా నవలల గురించి.

ఇవీ ఈవారం నా రచనల వివరాలు.

నేను కొత్తగా రాసిన పుస్తకం గురించి చర్చించాలని ఆత్రంగా వుంది. కానీ, ప్రచురణకర్త కిచ్చిన మాట నోరు కట్టేస్తోంది. పుస్తకం బాగా వచ్చింది. ప్రస్తుతం బాగా చర్చలోవున్న అంశం ఆధారంగా రచించినది. పాఠకులను విపరీతంగా ఆకర్శిస్తుందన్న నమ్మకం నాకుంది. ఎందుకంటే తెలుగులో ఇంతవరకూ ఇలాంటి రచన సంవిధానాన్ని ఎక్కువగా వాడలేదు. డీటేపీ కూడా వేగంగా సాగుతోంది. బహుషా వచ్చేవారానికల్లా ముద్రణ అయిపోతుంది. వివరాలను ఇలా కష్టపడుతూ దాచుకునే బాధ తీరిపోతుంది.

ఈవారం నా రచనలపైన మీ అభిప్రాయం నిర్మొహమాటంగా తెలపాలని ప్రార్ధన.

ఇంతకీ, నా కొత్త సొంతగూడు ఎలావుంది?

July 11, 2009 · Kasturi Murali Krishna · No Comments
Tags: , , , , , , ,  · Posted in: నా రచనలు.

ఈ వారం నా రచనలు-4

ఎప్పటిలాగే, ఈ ఆదివారం విడుదలయ్యే వార్త ఆదివారం అనుబంధంలో బ్లాగ్ స్పాట్ వుంటుంది. ఈ శీర్షికన ఈసారి, రాబిన్ శర్మ బ్లాగు పరిచయం చేశాను. ది మాంక్ హూ సోల్డ్ ఫెరారి, హూ విల్ క్రయ్ వెన్ యూ డయ్ లాంటి హిట్ వ్యక్తిత్వ వికాస పుస్తకాల రచయిత అతడు.

క్రితం ఆదివారం ఆంధ్రప్రభ  ఆదివారం అనుబంధం పూర్తిగా ఉగాది ప్రత్యేకం కావటంతో మామూలుగావుండే శీర్షికలు లేవు. దాంతో, క్రితం వారం రావాల్సిన భయాలు ఈవారం వస్తాయి.

ఆంధ్రభూమి వార పత్రికలోని పవర్ పాలిటిక్స్ శీర్షికన, ప్రస్తుతం జరగబోయే లోక సభ ఎన్నికల కోసం వివిధ పార్టీలలో జరుగుతున్న పొత్తుల ఆరాటాలు, వేర్పడే కసరత్తుల గురించి విశ్లేషణ వుంటుంది.  ఈసారి పార్టీలకు వచ్చే సీట్లకన్నా, ప్రధాని పదవిపైన ఆశవున్న అభ్యర్ధులే ఎక్కువగా వున్నారు.

ఈభూమి అని ఒక కొత్త పత్రిక వస్తోంది. ఈ పత్రికలో అనుకోకుండా ఒక శీర్షిక ఆరంభించాల్సివచ్చింది. రసమయి అనే మాస పత్రికలో నేను హిందీ గేయ రచయితల గేయాలను, వారు చూపిన చమత్కారాలనూ విశ్లేషిస్తూన్నాను. ఆ పత్రిక ఈ ఏప్రిల్ సంచికతో ఆగిపోతోంది. ఇప్పుడు అదే శీర్షికను ఈ భూమి పత్రికలో ఆప్రిల్ సంచిక నుంచీ ఆరంభిస్తున్నాను. రసమయిలో రచనకీ, ఈభూమి శీర్షికకూ తేడా వుంది.

రసమయి సాంస్కృతిక పత్రిక. కాబట్టి, కాస్త లోతుగా విశ్లేషించేవీలుంది. పైగా, పాఠకులంతా ఉచ్చస్థాయి కళాకారులు, ఉత్తమాభిరుచి వున్నవారు. అందుకని, కాస్త స్కాలర్లీ విశ్లేషణకు వీలుండేది.

ఈ భూమి పాఠకులను కేవలం స్కాలర్లీ అనలేము. రసమయిలాగా, ఇది రీసెర్చ్ రచనల పత్రిక కాదు. కాబట్టి, సినీ సంగీత కళాకారుల పరిచయం రసమయిలోలాగా, తీరికగా, నెలలల తరబడి చేసేవీలు లేదు. ఒకో నెలా ఒకరి పరిచయం అయిపోవాల్సిందే.

మొదటగా సాహిర్ లూధియానవీ పరిచయంతో ఆరంభించాను. సాహిర్ గురించి, సినీ గీతాలలో ఆయన పొందుపరచిన అయద్భుతమయిన భావాలగురించి ఎంత రాసినా తనివితీరదు. అయినా, పత్రిక పరిమితుల దృష్ట్యా ఒక్క సంచికతో సాహిర్ పరిచయాన్ని ముగించాను.

ఈనెల దివ్యధాత్రి మాస పత్రికలో ద్రష్ట సీరియల్ కొత్త మలుపు తిరుగుతంది. వారణాసి లోని స్వర్ణ శివ మందిరం పైన తురుష్కుల దాడికి రంగం సిద్ధమవుతుంది.

దివ్య ధాత్రిలోనే, దివ్య వ్యక్తిత్వాల శీర్షికన కుంభకర్ణుడి వ్యక్తిత్వ విశ్లేషణ వుంటుంది. కుంభకర్ణుడి రాక్షసత్వం నీడన మరుగునపదిన అతని మంచితనం గూర్చి వివరణ వుంటుంది.

ఆంధ్రభూమి దినపత్రిక గురువారం చిత్రభూమి అనే అనుబంధం వుంటుంది. సినెమా సిత్రాలు అనే శీర్షికన, ఈవారం కూడా కామెడీ సినిమా స్క్రిప్టుల గ్రించిన చర్చ కొనసాగుతుంది. 

కౌముది మాస పత్రికలో కథాసాగరమధనం శీర్షికన జనవరీ- ఫిబ్రవరీ నెలలలో వివిధ వార, దిన, మాస పత్రికలలో ప్రచురితమయిన కథలలోంచి నాకు నచ్చిన కథల పరిచయంవుంటుంది. వాటిల్లోంచి నాకు అత్యుత్తమంగా అనిపించిన కథను అందిస్తున్నాను. మీరూ నా అభిప్రాయాన్ని, కథను చదివి ఈ విషయంలో మీ అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా వెల్లడించవచ్చు. ఆరోగ్యకరమయిన చర్చ జరగాలన్నది నా కోరిక.

ఇవీ ఈవారం నా రచనలు. చదివి మీ అభిప్రాయాన్ని  నిర్మొహమాటంగా వ్యక్త పరుస్తారని ఆశిస్తున్నాను.

March 29, 2009 · Kasturi Murali Krishna · No Comments
Tags: , , , , , , , , ,  · Posted in: Uncategorized

ఈ వారం నా రచనలు-2

ఈ ఆదివారం, అంటే ఇవాళ్ళ, విడుదలయ్యే వార్త ఆదివారం అనుబంధంలో ఎప్పటిలాగే బ్లాగ్స్పాట్ శీర్షిక వుంటుంది.

ఈ శీర్షికన ఈవారం, ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్, నిర్మాత, దర్శకుడు- సంతోష్ శివన్ బ్లాగు పరిచయం వుంటుంది.

ఆంధ్రప్రభలో ప్రతివారంలాగే ఈసారికూడా సగటుమనిషి తన బాధలను సగటుమనిషి స్వహతం శీర్షిక వెళ్ళబోసుకుంటాడు. ఈవారం సగటుమనిషికి ఎదుటివారు, ఎడతెగకుండా, అతిపెద్దగా సెల్ ఫోన్లలో మాట్లాడుతూంటే కలిగేబాధల వేదనలుంటాయి.

ఈవారం ఆంధ్రభూమి వారపత్రికలో, పవర్ పాలిటిక్స్ శీర్షికన, ఇటీవలే ఎన్నికల కమీషన్ లో జరిగిన వివాద విశ్లేషణ వస్తుంది.

ఎప్పటిలాగే ప్రతి గురువారం, ఆంధ్రప్రభ దినపత్రికలో, చిత్రప్రభ అనుబంధం లో సినీ చిత్రాలు శీర్షికన, సినిమా స్క్రిప్టుల రచనకు సంబంధించిన వ్యాసం వుంతుంది. ఈవారం(44 వ వారం) కూడా హాస్య చిత్రాల విశ్లేషణ కొన సాగుతుంది.

ఇవీ ఈవారం వెలువడే నా రచనల వివరాలు.

ఈవారం వెలువడిన ఈవారం పత్రికలో, నా రచనలు, అక్షరాంజలి, రియల్ స్టోరీలపైన, స్వరలాసిక రాసిన పుస్తక సమీఖ్సలు వచ్చాయి.

అలాగే, ఆంధ్రభూమి వార పత్రికలో ఈ రెండు పుస్తకాలపై, సుధామ, రాసిన సమీఖ్స కూడా వచ్చింది.

వీటిలో వీలయినన్ని చదివి నిర్మొహమాటంగా మీ అభిప్రాయాన్ని వ్యక్తపరచండి.

సెలవు.

March 14, 2009 · Kasturi Murali Krishna · No Comments
Tags: , , , , , ,  · Posted in: నా రచనలు.